
January 20, 2026
wpl 2026 bangalore-gujarat match:డబ్ల్యూపీఎల్ ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎదురులేకుండాపోయింది. వరుస మ్యాచ్‌ల్లో విజయాలను సాధిస్తున్నారు. అజేయ రికార్డును కొనసాగిస్తూ ఆ జట్టు వరుసగా ఐదో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. సోమవారం రాత్రి గుజరాత్ జెయింట్స్‌తో వడోదర వేదికగా జరిగిన మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.






