
January 12, 2026
pakistan drones:జమ్మూకశ్మీర్ లో పాకిస్థాన్ డ్రోన్ల కలకలం రేపాయి. పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆదివారం రాత్రి జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోకి పాక్ డ్రోన్ల రావడంతో భారత్ సైన్యం వాటిపై కాల్పులు జరిపింది. ఈ ఘటన లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో చోటుచేసుకుంది. పలు డ్రోన్లు గగనతలంలో కనిపించాయి. డ్రోన్లు ఆయుధాలు లేదా మత్తు పదార్థాలు వదిలి ఉండవచ్చన్న అనుమానంతో సైన్యం ఆ ప్రాంతంలో విస్తృతంగా శోధిస్తోంది.






