Breaking News

కొత్త జిల్లాలు సరే.. మౌళికసదుపాయాలు ఎలా?

29 th Jan 2022, UTC

New districts OK How about infrastructure? : తెలంగాణలో కొత్త జిల్లాలు ఎప్పుడో ఏర్పాటయ్యాయి.. అయితే  అవి నామ్ కే వాస్తేగా మిగిలిపోతూ... పనులన్నీ ఉమ్యడి జిల్లాల పేరు మీదే జరుగుతున్నాయి .. కొత్త జిల్లాల కోసం కలెక్టరేట్లు ఏర్పాటైనా .. పెద్దగా ఒరిగిందేమీ లేదు.... చిన్న జిల్లాలతో ఉపయోగం లేకుండా పోయిందని ప్రజలే చికాకు పడుతున్న పరిస్థితి...  ఇప్పుడు జగన్ సర్కారు ఏపీలో కొత్త జిల్లాలు అంటోంది...  మరి తెలంగాణలో పరిస్థితి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టడీ చేసిందా? ... ఏపీలో జిల్లాల విభజన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? వాటిని అధిగమించడం సాధ్యమేనా? 

ఎన్నికల సమయంలో ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌ను జిల్లాగా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు జగన్ ... ఆ ప్రకారం ఏపీ సర్కారు 25 లోక్ సభ నియోజకవర్గాలలో మార్పులు చేర్పులు చేసి 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తానంటోంది .. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉన్న పది జిల్లాను విభజించి 33 జిల్లాలు చేసింది... పరిపాలనా సౌలభ్యం పేరుతో ముందు 31 జిల్లాలు ప్రకటించి... తర్వాత ఒత్తిళ్ల కారణంగా వాటిని 33కి పెంచించి కేసీఆర్ సర్కారు ...ఆ మేరకు పరిపాలనా సౌలభ్యం, దాని తాలూకు ఫలితాలు ప్రజలకు అందాయా అంటే అదీ లేదు. కొత్త పోస్టులు భర్తీ చేయక, సగం కలెక్టరేట్లు అరకొర స్టాఫ్ తో నెట్టుకొస్తున్నాయి.అదలా ఉంటే జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన ...తెలంగాణలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది... సీనియర్లంతా సహజంగానే పట్టణాలను కోరుకున్నారు...  దాంతో జూనియర్ ఉద్యోగులు పల్లెటూళ్లు ఎక్కువగా ఉన్న కొత్త జిల్లాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.... దీంతో ఉద్యోగుల మధ్య సమతుల్యం దెబ్బతింది. .. జూనియర్లకు కొత్త జిల్లాలే దిక్కయ్యాయి. 

ఆ పరిస్థితిలో జిల్లాల వారీగా భర్తీ చేసే పోస్టుల విషయంలో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగే పరిస్థితి తలెత్తింది.. సీనియర్లు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కొత్త నోటిఫికేషన్ల సమయంలో  పోస్టుల సంఖ్య భారీగా ఉంటుంది... జూనియర్లు ఎక్కువగా ఉన్న కొత్త జిల్లాల్లో నోటిఫికేషన్లు వేస్తే అరకొర ఖాళీలే ఉంటాయి... వారు ఉండే చోట్ల పదవీ విరమణ బ్యాచ్ తక్కువ కాబట్టి ఉద్యోగ ఖాళీలు ఇప్పట్లో పరిస్థితి ఉండదు.... అంటే నిరుద్యోగులకు కొన్నాళ్లు కష్టాలే... అలాగే సరిగ్గా వయోపరిమితికి దగ్గరగా ఉన్న వాళ్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందిఇక్కడ తెలంగాణ ప్రభుత్వ తప్పొప్పులు పక్కన పెడితే.. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఏపీ అధ్యయనం చేయాలన్న వాదన వినిపిస్తోంది ... ఒకవేళ కొత్త జిల్లాలు సమస్యల్ని సృష్టిస్తే మాత్రం జగన్ చేసిన ఈ ప్రయత్నం వికటించడం ఖాయమంటున్నారు.... అందుకే విభజన సమయం నుంచే కొత్త జిల్లాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలంటున్నారు .. కార్యాలయాలకు తగ్గట్టు ఉద్యోగ నియామకాలు చేపట్టి ప్రజలకు చేరువ అవ్వాల్సి ఉందన్న సూచనలు వినిపిస్తున్నాయి...  

తెలంగాణ లాంటి సంపన్న రాష్ట్రంలోనే ....కొత్త జిల్లాలకు సరిపడా నిధులు కేటాయించలేకపోయిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు ... మరి అసలే ఆర్థిక కష్టాలు,  అప్పుల భారంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటన్న ప్రశ్న వినిపిస్తోంది.... కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన కోసం వేల కోట్ల రూపాయల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా సమీకరిస్తుంది? ... నిధుల లేమితోనే కొత్త జిల్లాల్ని ప్రకటించి చేతులు దులుపుకుంటే ఆ జిల్లాల పరిస్థితి ఏంటనున్నారు ... మరి ముఖ్యమంత్రి జగన్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి. 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి 

దేశంలో అత్యంత ధనిక పార్టీగా బీజేపీ

మురికివాడ నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ... ఒక మహిళ ప్రయాణం

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox