KCR announces crore rupees for Mogilaiah: కేంద్ర ప్రభుత్వం ఇటీవల కిన్నెర వాయిద్యకళాకారుడు దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డును ప్రకటించారు. మొగిలయ్య కు హైద్రాబాద్ లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటి ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
మొగిలయ్య స్వస్థలం నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల. తాతల నుంచి తనకు అందిన 12 మెట్ల కిన్నెరతోనే ఆయన కాలం గడుపుతున్నాడు. తాత ముత్తాలనాటి జానపదకళకు ప్రాణం పోస్తున్నారు. ఊరూ వాడా తిరుగుతూ తన కళను అందరికీ పరియచం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వరకూ మొగిలియ్య బతుకులో ఏ మార్పు, పెద్ద పేరూ లేదు. సంతల్లో ఈ వాయిద్యం వాయిస్తూ పొట్టపోసుకునే వారు. మట్టి పని, కూలీ పని చేశారు. . తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మొగిలయ్యకు సన్మానం చేశారు. ఆ తరువాత ఆయన చరిత్ర 8వ తరగతి సిలబస్ లో చేర్చారు. దీంతో అప్పుడప్పుడు స్కూళ్లకు వెళ్లి ప్రదర్శనలిచ్చినప్పుడు అక్కడి ఉపాధ్యాయులు ఇచ్చే విరాళాలు కూడా మొగిలయ్యకు ఉపాధి కల్పించాయి
వాస్తవానికి ‘ఆడా లేడు మియా సాబ్.. ఈడా లేడు మియా సాబ్’ అంటూ మొగిలయ్య పాట పాడేవారు. ఆ పాటను ‘భీమ్లా నాయక్’ కోసం రామజోగయ్య శాస్త్రి చరణాలను మార్చి రాశారు. సహజత్వం దెబ్బతినకుండా సినిమా కోసం మొగిలయ్య గాత్రాన్నే వాడుకున్నారు.ఈ పాట పాపులర్ అయ్యాక పవన్ కళ్యాణ్.. మొగిలయ్యని అభినందించి ఆర్థిక సాయం కూడా చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

Read latest ట్రెండింగ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022