‘అరబిందో’కు 108 సర్వీసులు..!

12

108 అంబులెన్సు సేవలను ప్రభుత్వం అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు అప్పగించింది. ఇకపై 108 ఆపరేషన్లు ఆ ఫౌండేషన్‌ ద్వారా నిర్వహించేందుకు అనుమతిస్తూ వైద్యఆరోగ్య శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త అంబులెన్స్‌కు రూ.1,78,072, పాత అంబులెన్స్‌కు రూ.2,21,257 నెలకు చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఏపీఎంఎ్‌సఐడీసీ డైరెక్టర్‌ను ఆదేశించింది.