గాంధీలో గందరగోళం: గాంధీ ఆసుపత్రిలో అసలు ఏమి జరుగుతోంది ?

29

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి పాలనా యంత్రాంగం, హెచ్ ఓ డీ ల తో సూపరింటెండెంట్ డా. శ్రావణ్ కుమార్ సమావేశమయ్యారు. ఇప్పటికే సస్పెండైన డా. వసంత్ ఆరోపణలు నిరాధారమైనవని… మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన ఆరోపణలుగా సూపరింటెండెంట్ కొట్టి పారేశారు. ఆస్పత్రి పారిశుద్ధ్యంలో ఎలాంటి అవినీతి జరగడం లేదని .. వసంత్ మాటలను పట్టించుకోవద్దని సూపరింటెండెంట్ డా. శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మెడికల్ దుకాణాలు, క్యాంటీన్ నిర్వాహకుల నుంచి డాక్టర్ వసంత్ డబ్బులు డిమాండ్ చేశాడని.. అందుకు తగిన ఆధారాలున్నాయని శ్రావణ్ కుమార్ చెప్పారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఒక డాక్టర్ గా పని చేస్తే అనేక దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉందన్నారు శ్రావణ్ కుమార్ .. అంతేకాదు.. వసంత్ కు మానసిక వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాతే ఉద్యోగంలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.