కాళేశ్వరంలో కేసీఆర్ పర్యటన..!

25

తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు. కాళేశ్వరంలో ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని, స్వామి వారికి ప్రత్యేజ పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి మేడిగడ్డ చేరుకుంటారు. లక్ష్మి ఆనకట్ట, జలాశయాన్ని సీఎం పరిశీలిస్తారు. జలాశయంలో నీటి నిల్వ, ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహం, నీటి ఎత్తిపోత తదితర అంశాలను పరీక్షించనున్నారు. అధికారులు, ఇంజినీర్లతో అక్కడే సమీక్ష నిర్వహించనున్నారు.కాగా కాళేశ్వరం పర్యటన సందర్భంగా ప్రాణహిత, గోదావరి నదులు, పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు.