ఉప్పల్‌లో వివాహిత భవాని ధర్నా..!

22

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ సాయిబాబా కాలనిలో వివాహిత భవాని అత్తవారింటి ముందు ధర్నాకి దిగింది. ఆడపిల్ల పుట్టిందని భర్త, కుటుంబ సభ్యులు ఇంటి నుండి గెంటివేశారని భవాని చెబుతోంది. తనకి న్యాయం చేయాలంటూ, కూతురితో సహా భవాని అత్తవారింటి ముందు ధర్నా చేస్తోంది. దమ్మాయిగూడకు చెందిన భవానికి, ఉప్పల్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డికి 2013లో వివాహం జరిగింది. పెళ్లైన నాలుగేళ్ళకి కూతురు పుట్టింది. అప్పటి నుండి ఆడపిల్ల పుట్టిందని భర్త, కుటుంబ సభ్యులు హింసించడం మొదలు పెట్టారని భవాని ఆవేదన వ్యక్తం చేసింది. హింసను తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించి కౌన్సిలింగ్ ఇప్పించినా వారిలో మార్పు రాలేదని, పైగా తనని, కూతురిని తల్లిదండ్రుల వద్ద వదిలేశారని తెలిపింది. తనభర్తతో కలిసి ఉండాలని వస్తే ఇంట్లోకి రానివ్వడం లేదని భవాని వాపోయింది.