మూడేళ్లలో 12లక్షల చెట్ల నరికేసారు

7

దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా తెలంగా ణలో అత్యధిక చెట్లను నరికివేశారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మూడేళ్లలో 12,12,753 చెట్ల కొట్టివేతకు అనుమతినిచ్చామని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి బాబుల్‌ సుప్రియో వెల్లడించారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అడిగిన ఓ ప్రశ్నకు శుక్రవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో 2016-17లో 32407, 2017-18లో 658104, 2018-19లో 522242 చెట్లను నరికేశారు. గత మూడేళ్లలో ఏపీలో 4లక్షల 95వేల చెట్లను నరకడానికి అనుమతినిచ్చామని తెలిపారు. దేశవ్యాప్తంగా 2016-19 మధ్య 76లక్షల 72వేల చెట్ల నరికివేతకు అనుమతినివ్వగా, కంపెన్సేటరీ అటవీకరణ కింద 7కోట్ల 87లక్షల మొక్కలు నాటారని వివరించారు. తప్పనిసరైతేనే చెట్లను తొలగించాలని సూచించారు.