ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం..!

9

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. రోడ్లపై మైకులు బంద్‌ అయ్యాయి. కరీంనగర్‌ మినహా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు రేపు పోలింగ్‌ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఈ నెల 22న పోలింగ్‌, 25న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే 120 మున్సిపాలిటీల్లో 6 వేల 325 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9 కార్పొరేషన్లలో 1,586 పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. మరోవైపు ఈ నెల 24 న జరిగే కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికకు 385 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల్లో మొత్తం 53 లక్షల 36 వేల 505 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు వైన్స్‌, బార్లు బంద్‌, బల్క్ మెస్సేజ్‌లను నిషేధించారు.