దుక్కి దున్నిన మంత్రి

15

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన స్వగ్రామమైన వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలోని తమ వ్యవసాయక్షేత్రంలో కుమారుడు ప్రేమ్‌కుమార్‌ రావుతో కలిసి ట్రాక్టర్‌తో చేనులో దుక్కి దున్నారు. అనంతరం కూలీలతో కలిసి చేనులో నాట్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం నీళ్లు, 24 గంటల విద్యుత్తుతో రైతుల్లో సంతోషం నెలకొందని, ఇదంతా సీఎం కేసీఆర్‌ కృషి వల్లేనని అన్నారు.