పాతబస్తీ చాంద్రాయణగుట్ట లో దారుణం..!

37

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పిఎస్ పరిధిలో చోటు చేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షామాబాద్ లో రోడ్డుపై నిలబడి ఉన్న అక్క, చెల్లెళ్ల ను ఆటో డ్రైవర్లు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరిని వట్టేపల్లికి తీసుకు వెళ్లి చంపేస్తామని బెరించి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితులు తెలిపారు. అత్యాచారం తర్వాత ఇద్దరిని దుండగులు నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద వదిలి వెళ్లారు. జరిగిన సంఘటన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఆటో డ్రైవర్లు మూసా, అమీర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.