ఆర్టీసీ కొత్త చార్జీలు నేటి నుంచే..!

16

టీఎస్‌ఆర్టీసీ పెంచిన టికెట్‌ ఛార్జీలు నిన్న అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. అన్ని రకాల బస్సు ఛార్జీలను ఆర్టీసీ యాజమాన్యం పెంచింది. కిలోమీటరుకు 20 పైసలు పెంచేందుకు… రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన తరుణంలో… మూడు రోజులుగా కసరత్తు చేసిన అధికారులు ఛార్జీల పెంపు వివరాలను నిన్న ప్రకటించారు. విద్యార్థుల బస్‌పాస్‌ ఛార్జీలను కూడా 2013 తర్వాత తొలిసారి పెంచారు.
నెలవారీగా జారీ చేసే బస్‌ పాసు ఛార్జీలనూ ఆర్టీసీ యాజమాన్యం పెంచింది. ఎంఎంటీఎస్‌-ఆర్టీసీ కాంబో టికెట్‌ ధరలను కూడా పెంచింది.

పల్లె వెలుగు బస్సుల్లో 10 రూపాయలు చార్జీ పెంచారు. సెమీ ఎక్స్ ప్రెస్ ఎక్స్ ప్రెస్ బస్సులు ఛార్జీలు కనీసం 15 రూపాయలు పెంచారు. డీలక్స్ బస్సుల ఛార్జీలు కనీసం 20 రూపాయలు పెరిగింది. సూపర్ లగ్జరీ ఛార్జీలు కనీసం 25 రూపాయలు పెంచారు. రాజధాని, వజ్ర ఎసీ బస్సులు, గరుడ ప్లస్ ఏసీ ఛార్జీలు కనీసం 35 పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్ ఛార్జీలు కనీసం 70 రూపాయలు పెంచారు.