ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. గజ్వెల్ లోని ఫామ్ హౌస్ నుంచి సీఎం కేసీఆర్… మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఢిల్లీ లోనే 2 రోజుల పాటు కేసీఆర్ పర్యటన సాగనుంది. హస్తిన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో పాటు, ప్రధానిని కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఉద్యోగుల విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిషన్ భగీరథకి నిధుల పై ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నారు. చివరి సారిగా అక్టోబర్ 4 న మోదీ తో కేసీఆర్ భేటీ అయ్యారు.