బాలాపూర్ ASI నర్సింహులు మృతి..!

బాలాపూర్ ASI నర్సింహులు ఈ తెల్లవారుజామున మృతి చెందారు. బాలాపూర్ ఇన్ స్పెక్టర్ వేధింపులు భరించలేక…కొన్ని రోజుల క్రితం నర్సింహులు ఒంటి పై పెట్రోలు పోసుకొని స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన నర్సింహులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా… ఈ తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలాపూర్ ఇన్ స్పెక్టర్ తనను వేధిస్తున్నారన్న నర్సింహులు ఆరోపణలతో… ఉన్నతాధికారులు విచారణ జరిపి ఇన్ స్పెక్టర్ ను మరో స్టేషన్ కు బదిలీ చేశారు.