మళ్లీ మోరాయించిన మెట్రో..!

హైదరాబాద్‌లోని ప్యారడైజ్ వద్ద నిలిచిపోయి మెట్రో ట్రైన్. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్‌ వల్ల ఆగిపోయింది. దీంతో.. ట్రోన్‌లో ప్రయాణికులు.. తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు. మరో మెట్రో రైలు తీసుకువచ్చి.. రిపేరులో ఉన్న రైలును ప్యారడైజ్‌ స్టేషన్‌కి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆగిపోయిన ట్రైన్‌కి మరమ్మత్తులు చేస్తున్న మెట్రో సిబ్బంది. మెట్రో రైలు నిలిచిపోవడంతోపై స్పందించిన సంస్థ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి. కొన్ని టెక్నినల్‌ ప్రాబ్లమ్స్‌ వల్ల ఆగిపోయినట్టు తెలిపారు. విద్యుత్ వైఫల్యంతో.. ఈ సమస్య తలెత్తిందని.. మరోసారి ఇలా జరగకుండా ఉంటామని ప్రయాణికులకు తెలియజేశారు. ఇప్పటికే మెట్రో స్టేషన్స్‌కి పగుళ్లు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు ఇలా జరగడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.