చిరంజీవికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన KCR..!

చిరంజీవికి నిజంగానే ఊహించని బహుమతి ఇచ్చాడు కేసీఆర్. ఈయన చేసిన ఓ పనితో ఇప్పుడు సైరా బయ్యర్లు పండగ చేసుకోడానికి రెడీ అవుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఆర్టీసీ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. బస్సులు నడవక ఇక్కడ ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి కూడా ఆర్టీసీ సమ్మె సవాల్‌గా మారుతుంది. దాంతో జనం ఇబ్బందులు గమనించిన కేసీఆర్.. దసరా సెలవులు మరో వారం రోజుల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 10 రోజులకు పైగా సెలవులు ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఇప్పుడు మరోవారం రోజులు పొడగించింది.

పండగ తర్వాత స్కూల్స్ ఓపెన్ అయితే బస్సులు లేక జనం మరిన్ని అవస్థలు పడతారని ఊహించిన ముఖ్యమంత్రి.. వారం రోజుల పాటు సెలవులు పొడిగించాడు. అక్టోబర్ 14 నుంచి ఓపెన్ కావాల్సిన స్కూల్స్ మరో ఇప్పుడు అక్టోబర్ 19 వరకు మూత పడనున్నాయి. అంటే హాలీడేస్ వారం రోజులు ఎక్కువగా వస్తాయి. అది కూడా తెలంగాణలో సైరా సినిమాకు బాగా హెల్ప్ చేస్తాయి. సినిమా వచ్చి 10 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ సైరా దూకుడు కొనసాగుతూనే ఉంది.

తెలంగాణ, ఆంధ్రాలో చిరంజీవి రప్ఫాడిస్తున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల షేర్ వైపు అడుగులు వేస్తుంది సైరా. ఇలాంటి సమయంలో వారం రోజులు సెలవులు పెరిగితే వసూళ్లు కూడా భారీగానే పెరగడం ఖాయం. కేసీఆర్ నుంచి వచ్చిన ఈ గిఫ్టుతో సైరా డిస్ట్రిబ్యూటర్లు కూడా సంతోషంలో మునిగిపోయారు.