అబ్బో ఎవరి మీటింగ్స్ వారివే..ఎవరూ తగ్గడం లేదు..కానీ ఛస్తుంది జనాలే?

111

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేసిన మాకు సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. సమ్మోలో పాల్గొన్న ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలిగిస్తున్నట్టులు ప్రభుత్వం ప్రకటించాడు ముఖ్యమంత్రి కేసీఆర్.

ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ నిర్ణయాల పట్ల అసంతృప్తితో ఉన్న ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెను మరింత ఉదృతం చేశారు. కేసీఆర్ ఏమో నో అంటే నో అంటున్నాడు. వీరు ఏమో చెయ్యనిదే ఒప్పుకునేది లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు.

ఏమైతే ఎం.. వీరి ఇద్దరి మధ్యలో ప్రయాణికులు ఇబ్బందులు పాలవుతున్నారు. పండుగా పూటా నానాపాట్లు పడుతున్నారు. ఇదే సమయం అని ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుంచి భారీగా డబ్బులు వాసులు చేస్తున్నారు. మాములుగా 500 ఉండే టికెట్ ఇప్పుడు 2000 రూపాయలకు చేరింది. ఇంకా సిటీలో ఉండే ప్రజల కష్టాలు అయితే చెప్పనక్కర్ లేదు.

ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్న సర్కార్ మాత్రం తగ్గటం లేదు. మీరు మొండి అయితే..నేను జగమొండి అన్నట్టు సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. మీరు ఎన్ని రోజులు సమ్మె చేసుకుంటారో చేసుకోండి మేము మీ స్థానంలో కొత్తవారిని నియమించుకుంటాం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు కేసీఆర్.