యురేనియం తవ్వకాలపై కాంగ్రెస్ పోరుబాట, వీహెచ్ ఛైర్మన్‌గా కమిటీ

నల్లమలలో యురేనియం తవ్వకాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ప్రభుత్వంపై పోరుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. తవ్వకాలపై నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 16 మందితో కూడిన ఈ కమిటీకి పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)ను ఛైర్మన్ గా నియమించారు.