టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన సోమారపు సత్యనారాయణ

టీఆర్ఎస్ కు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ షాకిచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు. పార్టీలో అరాచకం పతాకస్థాయికి చేరిందని ఆయన మండిపడ్డారు. తన అనుచరులతో పాటు తనపై కూడా పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు పుస్తకాలను కూడా ఇవ్వకుండా, తనను అవమానపరిచారని చెప్పారు. తాను అడగకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని ఇచ్చారని… కానీ, కొందరి వల్ల తాను పార్టీలో ఇమడలేకపోతున్నానని తెలిపారు. అయితే, ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.