పోలీసులు Vs జీహెచ్ఎంసీ

చట్టానికి ఎవరూ అతీతులు కాదు. హెల్మెట్ పెట్టుకోలేదనో, రాంగ్ పార్కింగ్ చేశారనో సామాన్య ప్రజలకు జరిమానాలను వడ్డించే పోలీసులు కూడా అతీతం కాదు. తప్పు ఎవరు చేసినా తప్పే అంటోంది జీహెచ్ఎంసీ. నిబంధనలకు విరుద్ధంగా గోల్కొండ కోట వద్ద ఫ్లెక్సీని ఏర్పాటుచేసిన స్థానిక పోలీస్ స్టేషన్‌కు జీఎహెచ్ఎంసీ అధికారులు జరిమానా వడ్డించారు. తమ అనుమతి లేకుండా ఈ పనిచేసినందుకు రూ. 10 వేల ఫైన్ కట్టాలని ఆదేశించించారు.