టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనంపై విచారణ రేపటికి వాయిదా..!

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌, సీఎల్పీ విలీనం పిటిషన్లను ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్లపై హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌, సీఎల్పీ విలీనం పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.