కేటీఆర్ అన్ననన్నుకాపాడుండ్రి ..!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన మహ్మద్ సమీర్ (21) అనే యువకుడు ఏజెంట్ మోసంతో సౌదీఎడారిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఉన్న ఊరిలో ఉపాధి కరువైన సమీర్.. తెలిసిన ఒక బంధువు సాయంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన వాహీద్ అనే ఏజెంట్ ద్వారా వీసా పొందాడు. వీసా కోసం సదరు ఏజెంట్ వాహిద్ కు 80,000 వేలు చెల్లించాడు. దీంతో ఈ నెల ఎప్రీల్ 17 న సౌది వెళ్లాడు. అక్కడ వెళ్లగానే కపిల్ విమానశ్రయం నుండి నేరుగా ఎడారి తీసుకెళ్లాడు. అక్కడే గొర్ల దగ్గర ఎడారిలో పని చేయాలని చెప్పడంతో సమీర్ పరిస్థితి దయనీయంగా మారింది. మొదట ఫంక్షన్ హాల్ లో పని అని చెప్పి.. ఇప్పుడు గొర్లకాపరిగా ఎందుకు పెట్టారని.. కపిల్ ను ఎజెంట్ సమీర్ ప్రశ్నించాడు. దీంతో వాళ్లు ఇదే పని చేయాలని చెప్పారు. కనీసం సమీర్ దగ్గర ఫోన్ కూడా లేదు అక్కడ ఎవరో వెళ్తుంటే ఫోన్ తీసుకుని తన కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. తనను ఇంటికి పంపించే విధంగా చేయాలని వేడుకున్నాడు. ఈ విషయం ఏజెంట్ వాహిద్ ను అడిగితే పని చేయ్యకుంటే లక్ష ఇరువై వేలు (1,20,0000) ఇవ్వాలని.. ఇంటికి పంపిస్తానని చెపుతున్నాడు. లేదంటే అక్కడే ఉంటాడు మీరు ఎమన్న చేసుకోర్రి అంటున్నాడని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తన కొడుకును ప్రాణాలతో ఇంటికి వచ్చేటట్టు చేయాలని సమీర్ తల్లి రఫియా వేడుకుంటుంది. ఎజెంట్ పేరు వాహిద్ నిజామబాద్ సెల్: +966551764703
సమీర్ కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ 7036329330 తెలంగాణ ప్రభుత్వం స్పందించి సమీర్ ను క్షేమంగా స్వగ్రామానికి తీసుకరావాలని మనస్ఫూర్తిగా కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు, యావత్ తెలంగాణా సమాజం కోరుకుంటోంది.