టీఎస్ ఆర్టీసీ బస్సు బోల్తా..!

తెలంగాణ రాష్ట్రంలో మరో బస్ ప్రమాదం అందరిని భయాందోళనకు గురి చేసింది. జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన AP 01Y 2992 నెంబరు గల ఆర్టీసీ బస్సు గోదావరిఖని నుంచి భూపాలపల్లికి బయలుదేరింది. సోమన్‌పల్లి వంతెన వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 35 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని మహదేవ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. బస్సు డ్రైవర్.. బస్సు రన్నింగ్‌లో ఉండగా.. గుట్కా వేసుకోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టినట్టు బస్సులోని ప్రయాణికులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు. సంఘటనా స్థలానికి చేరుకున క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు. బస్సు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.