ఇంటర్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై హరీశ్ రావు స్పందించారు !

ఇంటర్ లో ఫెయిలైనంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదని, ప్రాణాలు తీసుకోవద్దని టీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందని అన్నారు. పిల్లలను ఒత్తిడికి గురిచేసే పనులు చేయొద్దని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. మన కంటి పాపలైన బిడ్డల్ని కాపాడుకుందామని పేర్కొన్నారు.

ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఫెయిలైన విద్యార్థులు వరుసపెట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు. వరుస ఘటనలపై మాజీ మంత్రి హారీశ్ రావు స్పందించారు. పరీక్షల్లో ఫెయిలైనంత మాత్రాన జీవితంలో ఓడినట్టు కాదని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని సూచించారు.