చంద్రబాబుకు కేటీఆర్ ప్రశ్నల వర్షం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం మీడియా తో మాట్లాడిన ఆయన..తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాల్లో విజయ డంఖా మోగించబోతుందని ధీమా వ్యక్తం చేసారు. మెజారిటీలో మొదక్‌ మొదటి స్థానంలో, వరంగల్ రెండో స్థానంలో, కరీంనగర్‌ మూడు లేదా నాలుగో స్థానంలో నిలుస్తాయన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయానికి వస్తే..ప్రజల పట్ల నమ్మకం లేకనే చంద్రబాబు ఢిల్లీ దారి పట్టాడని..ప్రజా తీర్పును స్వాగతించాలి కానీ చంద్రబాబులా గగ్గోలు పెట్టొద్దన్నారు. గెలిస్తే సాంకేతికత భేష్ అని, లేకపోతే ఈవీఎంల తప్పు అని చంద్రబాబు అనడం సరికాదన్నారు.ఆయన వాదనల్లో విశ్వసనీయత ఉంటే ప్రజలు ఆధరిస్తారని చెప్పారు.40ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న వ్యక్తి ఇంత చిల్లర అరుపులు ఎందుకు అరుస్తున్నారో అర్థం కావడంలేదన్నారు.