మల్కాజిగిరి నుండి రేవంత్ పోటీ..?

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన రేవంత్ రెడ్డి..మరోసారి ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతున్నాడు. ఏప్రిల్ 11 న తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార పార్టీ టిఆర్ఎస్ తమ ప్రచారాన్ని మొదలు పెట్టగా..కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు చేయడం లో బిజీ అయ్యింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి నుంచి పోటీకి దించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది.

తాజాగా రేవంత్ కూడా కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలోకి దిగుతానని చెప్పుకొచ్చిన…ముందు నుండి కూడా ఆయనకు మల్కాజిగిరి నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తున్నాడు. ఇప్పుడే అదే ఖరారు అయ్యేట్లు ఉంది. 2014 ఎన్నికల్లోనే మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కొడంగల్‌లో తన సోదరుడ్ని పోటీకి పెట్టి.. తాను.. మల్కాజిగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేయాలనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితుల్లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డి అయితేనే గెలవగలరని … చెప్పి చంద్రబాబు… మల్కాజిగిరి లోక్‌సభ టిక్కెట్‌ను.. మల్లారెడ్డికి కేటాయించారు. మల్లారెడ్డి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి తన కోరిక ను తీర్చుకోబోతున్నాడు రేవంత్. మరి టిఆర్ఎస్ అభ్యర్థి ని ఢీ కొట్టే అంత సత్తా రేవంత్ కూడా ఉందా అనేది ప్రశ్న. మొన్నటి ఎన్నికల్లో క్లిన్ స్వీప్ చేసి టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లోనూ అదే రిపీట్ చేయాలనీ చూస్తుంది. ఇప్పటికే కేటీఆర్ ప్రచారాన్ని మొదలు పెట్టగా..కేసీఆర్ సైతం ప్రచారానికి సిద్దమవుతున్నాడు.