గ్రేటర్ లోని 15 నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పాదయాత్ర.

సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ హైదరాబాద్‌ నగర పార్టీకి అధ్యక్షుడైన తర్వాత గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. హైదరాబాద్‌ జిల్లాలోని పదిహేను శాసనసభ అసెంబ్లీల పరిధిలో ప్రచారాన్ని ప్రారంభించింది. ‘ఇంటింటికి కాంగ్రెస్‌’ పేరుతొ తెరాస వైఫల్యాల్ని ఎండగట్టే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌, బోస్‌రాజు, భట్టివిక్రమార్క తదితరులు ఖైరతాబాద్‌ మహంకాళి పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అంజన్‌కుమార్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. 15 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగనుంది.

Post expires at 2:28pm on Saturday October 6th, 2018