నడిరోడ్డుపై నరికివేత..!

హైదరాబాద్‌ లోని అత్తాపూర్‌లో నడిరోడ్డుపై సిద్ధిఅంబర్‌ బజార్‌కు చెందిన రమేశ్‌ అనే వ్యక్తిని నలుగురు వ్య క్తులు దారుణంగా నరికి చంపారు. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గుయ్యారు.

తన భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న కక్షతో మృతుడు రమేశ్‌ ఆరు నెలల క్రితం మహేశ్‌ అనే యువకుడిని శంషాబాద్‌లో హత్య చేశాడు.‌ ఆ కేసులో ప్రస్తుతం బెయిల్‌ పై వున్న రమేశ్‌ ఈ కేసు విచారణలో భాగంగానే ఉప్పర్‌పల్లి న్యాయస్థానంలో హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మహేశ్‌ తండ్రి, బంధువు నడిరోడ్డుపై రమేశ్‌ను హత్య చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.