రేవంత్‌రెడ్డిపై ఈడి దాడులు..!

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి సంబంధించిన ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు విర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచి రేవంత్‌రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్లలోనూ మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. గతంలో ‘జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ’లో అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎంఎల్‌ఎ రేవంత్‌రెడ్డితో పాటు 13 మందిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో 2002లో కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 12న ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు 13 మందికి సిఆర్‌పిసి 41 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. ఆ క్రమంలోనే ఈ దాడులు నిర్వహిస్తున్నట్టుగా బహ్వఇస్తున్నారు.

గతంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో లేఔట్ చేసిన ‘జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ’ సభ్యులకు ప్లాట్లు విక్రయించింది. లేఔట్ చేసే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్ లోని ప్రభుత్వ స్థలాలను అక్రమంగా విక్రయించారని రేవంత్ ఫై ఆరోపణలున్నాయి.