Breaking News

రేవంత్ రెడ్డి ఇంటిముట్టడికి టీఆర్ఎస్ నేతల యత్నం

21 st Sep 2021, UTC

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  చేసిన వైట్ చాలెంజ్ సవాల్ తో  కాంగ్రెస్ , టీఆర్ ఎస్ ల మధ్య మాటలయుద్దం ముగిసింది. మంత్రి కేటీఆర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు టిఆర్ఎస్ నాయకులు నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్దదం చేయడానికి ప్రయత్నించారు. అంతేకాదు..టిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు.

ఈ  సందర్బంగా  రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు, టిఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగి తోపులాటకు దారితీసింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఇరు వర్గాలు మధ్య ఘర్షణ చెలరేగడంతో ఒకరిపై ఒకరు కర్రలతో, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్దితిని అదుపులోకి తీసుకు వచ్చారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ సోమవారం సిటీ సివిల్‌ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అసత్య, నిరాధార ఆరోపణలు చేసిన ఆయన.. సోషల్ మీడియా, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లోనూ, బహిరంగంగానూ బేషరతు క్షమాపణ చెప్పేలా ఆదేశాలివ్వాలంటూ కోర్టును అభ్యర్థించారు.  మంత్రి కేటీఆర్ ను డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా రేవంత్ రెడ్డి వర్ణించిన విషయం తెలిసిందే.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox