famous writer Endluri Sudhakar: ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నాది హిందూ నాగరికత కాదు... చిందు నాగరికత అని చాటిన కవి ఎండ్లూరి. ఓ నా చండాలికా... నీ వెండి కడియాల నల్ల పాదాల ముందు... వెయ్యేళ్ల కావ్య నాయికలు వెలవెలబోతున్నారంటూ... విస్మృతికి గురైన వర్గాల పక్షాన ఆయన కలాన్ని ఝులిపించారు.
ఎండ్లూరి సుధాకర్ 1959, జనవరి 21న నిజామాబాద్‌లోని పాములబస్తిలో జన్మించారు. తెలుగు విశ్వవిద్యాలయం-రాజమండ్రిలో ఆచార్యుడిగా 28 సంవత్సరాలు పని చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా, తెలుగు అకాడమీ సభ్యుడిగా, పలు హిందీ, ఉర్దూ కవితలను, లఘు చిత్రాల అనువదించారు. వర్తమానం, కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లెమొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, వర్గీకరణీయం, గోసంగి, కథానాయకుడు జాషువా, తెలి వెన్నెల లాంటి రచనలతో తెలుగు సమాజంపై బలమైన ముద్రను వేశారు. ఎండ్లూరి సుధాకర్ మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అభ్యుదయ స్ఫూర్తినిచ్చే రచనలతో తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి మరణం విచారకరమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సుధాకర్ మృతి తెలుగు సాహితీ లోకానికే కాదు, దళిత సమాజానికి కూడా తీరని లోటుగా అభివర్ణించారు. సుధాకర్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
తెలుగుదనం, దళిత కలం, హక్కుల గళం ఆచార్య ఎండ్లూరి సుధాకర్ మృతి తెలుగు భాష, సాహిత్య రంగాలకి తీరని లోటని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. పాఠాలతో విద్యార్థులను, రచనలతో సమాజాన్ని చైతన్యం చేసి అణగారిన దళితులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. సాహిత్య లోకం నుంచి ‘కొత్త గబ్బిలం’ నిష్క్రమించినా ఆయన రచనలు ఎప్పటికీ వర్తమానమే అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి
అమెరికాలో ఈ ఏడాది మొదటి ఉరిశిక్ష ఎవరికో తెలుసా?
వారు జిన్నా ఆరాధకులు.. పాక్ మద్దతుదారులు.. యూపీ సీఎం యోగి యోగి ఆదిత్యనాథ్

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022