Breaking News

రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు.. కేటీఆర్

18 th Sep 2021, UTC
రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు..  కేటీఆర్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. మద్యానికి సీఎం కేసీఆర్, డ్రగ్స్‌కు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్లన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమని సవాల్ విసిరారు. అవసరమైతే తన రక్తం, వెంట్రుకలను కూడా టెస్టులకు ఇస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా నాలాగే శాంపిల్స్ ఇస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరి అడ్డగాడిదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదని, మార్కెట్ చేసుకొనేందుకు హడావిడి తప్ప అంత సీన్ లేదని కేటీఆర్‌ ఎద్దేవాచేశారు. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్‌ జాతీయ పార్టీలకు తొత్తులని దుయ్యబట్టారు. షర్మిల, సీఎం కేసీఆర్‌పై తప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సీఎంను నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనకాడమని హెచ్చరించారు.

టీఆర్‌ఎస్ ఓట్లు చీల్చి జాతీయ పార్టీలకు న్యాయం చేయాలని చూస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉండే రాష్ట్రాల్లో దమ్ముంటే బీసీబంధు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు నిజమైన ముక్తి రాష్ట్రం ఏర్పడటంతోనే జరిగిందని తెలిపారు. బీజేపీకి సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదని, ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యునిస్టులేనని కేటీఆర్ గుర్తుచేశారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox