Breaking News

గులాబీ గూటికి మోత్కుపల్లి నర్సింహులు

16 th Oct 2021, UTC
గులాబీ గూటికి  మోత్కుపల్లి నర్సింహులు

 మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు  ఈ నెల 18 మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ ఎస్ లో చేరనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు  నియోజకవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణలోని సీనియర్‌ నేతల్లో ఒకరు. గతంలో టీడీపీ , కాంగ్రెస్‌  పార్టీల్లో కొనసాగి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశారు. బీజేపీ  లో చేరిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. 

 కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకంపై  పొగడ్తల వర్షం కురిపించిన నర్సింహులు సీఎం కేసీఆర్ నుఅంబేద్కర్‌గా కీర్తించారు మోత్కుపల్లి. పార్టీలకు అతీతంగా నేతలందరూ ఈ పథకం విషయంలో సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వానికి అండగా నిలవాలని నర్సింహులు పిలుపునిచ్చారు. దీంతో ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరతారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. 

 మరోవైపు సీఎం కేసీఆర్ మోత్కుపల్లి నర్సింహులకు కీలక పదవి ఇస్తారని  కూడ వార్తలు వచ్చాయి. దళితబంధు పథకానికి చట్టబద్ధత తీసుకొచ్చి.. ఆ పథకం అమలు కోసం మోత్కుపల్లి నర్సింహులును చైర్మన్‌గా నియమించాలని కేసీఆర్ ముందునుంచే అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ కూడా ఇస్తారని తెలుస్తోంది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox