Breaking News

డ్రగ్స్ పరీక్షలపై కేటీఆర్ x రేవంత్ రెడ్డి

20 th Sep 2021, UTC

డ్రగ్స్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ లో మాటల యుద్దం జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మంత్రి కేటీఆర్‌కి వైట్ చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు అమరవీరుల స్థూపం వద్దకు రావాలని.. అక్కడికొస్తే ఆసుపత్రికి వెళ్లి డ్రగ్స్ టెస్టు చేసుకుందాం అని రేవంత్ సవాల్ విసిరారు.

రేవంత్ సవాలుపై ట్విటర్ ద్వారా స్పందించిన కేటీఆర్... నేను ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాను. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధమా?... ఆ టెస్ట్‌లో నాకు క్లీన్ చిట్ వస్తే మీరు క్షమాపణలు చెబుతారా?... చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో నా స్థాయి కాదు. క్లీన్‌చిట్‌ వస్తే రేవంత్‌ క్షమాపణలు చెప్పి పదవులు వదులుకుంటారా? ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా? అని కేటీఆర్ ట్వీట్‌లో సవాలు చేశారు.

ఇటీవల సైదాబాద్ చిన్నారి ఘటన తరువాత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కార్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. తెలంగాణలో మద్యం, డ్రగ్స్ వినియోగం ఎక్కవ అవడంతోనే నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. అంతేకాదు సీఎం కేసీఆర్ తాగుబోతలకు, మంత్రి కేటీఆర్  డ్రగ్స్ కు బ్రాండ్ అంబాసిడర్లగా మారారని ఆరోపించారు. దీనిపై కేటీఆర్ మండిపడ్డారు. తాను ఎటువంటి పరీక్షలకైనా సిద్దమని చాలెంజ్ చేసారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox