Breaking News

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా

20 th Sep 2021, UTC

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో కొనసాగిన వివాదం ఇప్పుడు కోర్టు కెక్కింది. ఈరోజు తాను చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించానని... కోర్టులో పరువునష్టం దావా వేశానని కేటీఆర్ ప్రకటించారు. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని... అబద్ధాలను కోర్టు రుజువు చేస్తుందని, అపరాధులు తగిన విధంగా బుక్ అవుతారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కోర్టు ద్వారా తనపై వస్తున్న తప్పుడు ప్రచారానికి తెరపడుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరోవైపుకేటీఆర్ ట్విట్టర్ వేదికగా విసిరిన సవాల్ కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ సవాల్ ను స్వీకరించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు రేవంత్ రెడ్డి సిద్ధం కావాలని కేటీఆర్ సవాల్ చేశారు. అందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, తమతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సహారా, ఈఎస్ఐ కుంభకోణాల్లో లైడిటెక్టర్ టెస్టులకు సిద్ధపడాలని ఆయన షరతు పెట్టారు.

గత కొద్ది రోజులుగా డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్  పై రేవంత్ రెడ్డి  విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సినీ ప్రముఖులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox