Away from Raj Bhavan: కేంద్రానికి, తెలంగాణకు మధ్య వైరం పెరుగుతోందా..? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. రాజ్ భవన్లో గణతంత్ర వేడుకలకు కేసీఆర్ హాజరుకాకపోవడంపైన పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కావాలనే సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు హాజరుకాలేదనే వాదనలు ఉన్నాయి. సీఎంవో, రాజ్‌భవన్ మధ్య దూరం పెరిగిందని అంటున్నారు. రిపబ్లిక్ వేడుకలకు తెలంగాణ మంత్రులు కూడా హాజరు కాకపోవడం వెనక ఆంతర్యమేంటనే చర్చ జరుగుతోంది. గవర్నర్ తమిళిసై ప్రసంగాన్ని క్యాబినెట్ కూడా ఆమోదించలేదని అంటున్నారు. ప్రగతి భవన్‌లోనే ఉన్నప్పటికీ కూతవేటు దూరంలోని రాజ్‌భవన్‌కు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
గవర్నర్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రగతి లెక్కలను ప్రస్తావించకుండా.. కేంద్ర ప్రగతి, ప్రధాని మోదీని ప్రశంసించడంపైనే దృష్టి పెట్టారు. రాష్ట్రానికి కేంద్రం 8 మెడికల్ కాలేజీలు ఇచ్చిందని వెల్లడించారు. సీఎం, మంత్రులు వెళ్లకుండా గణతంత్ర దినోత్సవాన్ని అవమానించారన్న ఆరోపణలు బీజేపీ సహా విపక్షాల నుంచి వెలువడుతున్నాయి. గవర్నర్‌తో విభేదాలుంటే కనీసం ఆ పదవికైనా విలువ ఇవ్వాల్సిఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గణతంత్ర దినోత్సవానికి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉత్సవాన్ని రాజ్‌భవన్‌కు పరిమితం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం కూడా డెల్టా వేరియంట్ విజృంభించిందని, అప్పుడు పబ్లిక్ గార్డెన్లో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారని.. సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారని గుర్తుచేస్తున్నారు. అప్పుడు లేని కరోనా భయం ఇప్పుడే పుట్టుకొచ్చిందా? అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు హాజరైన సీఎం.. ఇప్పుడు ఎందుకు హాజరు కాలేదని అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేంద్రంలో బీజేపీతో ఇటీవల పెరిగిన విభేదాల కారణంగానే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో కేసీఆర్ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
గవర్నర్ తమిళిసై ఇటీవల రాష్ట్ర ప్రగతిని కాకుండా ప్రధాని మోదీని పొగుడుతుండడం కూడా కేసీఆర్‌తో గ్యాప్ పెరిగిందనడానికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. పైగా గణతంత్ర దినోత్సవం నాడు గవర్నర్ చదివిన స్పీచ్ కాపీని క్యాబినెట్ ఆమోదించలేదని, గవర్నరే స్వయంగా తయారు చేసుకుని చదివారని చర్చించుకుంటున్నారు. ప్రధాని మోదీ ఇటీవల కొవిడ్‌పై అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా కేసీఆర్ డుమ్మా కొట్టారు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవానికీ గైర్హాజరయ్యారు. అంటే కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే బీజేపీ నేతలతో, ఆ పార్టీ నియమించిన గవర్నర్‌తో దూరంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది.. పరేడ్ గ్రౌండ్ లేదా పబ్లిక్ గార్డెన్లో నిర్వహించాల్సిన గణతంత్ర దినోత్సవాన్ని ఈసారి రాజ్‌భవన్‌కు పరిమితం చేయడం కూడా చర్చనీయాంశమైంది.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022