Breaking News

ఆ ముగ్గురు ఏపీ ఎమ్మెల్యేలను అంతమొందిస్తే రూ.50 లక్షలు ఇస్తాను.. టీఆర్ఎస్ కార్పోరేటర్ మల్లాది వాసు

01 st Dec 2021, UTC

ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు ఎమ్మెల్యేల తలలకు ఖమ్మం జిల్లా మధిరకు  చెందిన టీఆర్ఎస్ కార్పోరేటర్ మల్లాది వాసు ‘వెల’ కట్టడం చర్చనీయాంశంగా మారింది. గన్నవరం, గుడివాడ, సత్తెనపల్లి ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబులను భౌతికంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని, అందుకు తాను 50 లక్షల మొత్తాన్ని ఆర్థికంగా చేయూతనిస్తానని బహిరంగంగా ప్రకటించడం కలకలం రేపుతోంది.   మధిర సమీపంలోని కృష్ణాపురం మామిడి తోటలో జరిగిన కార్తీక సమారాధన కార్యక్రమంలో తోటి సామాజిక వర్గీయులను రెచ్చగొడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

కమ్మ కులంలో చీడపురుగుల్లా తయారైన వల్లభనేని వంశీ, కొడాలి నానీని భౌతికంగా లేకుండా చెయ్యాలంటూ మల్లాది వాసు కనీవినీ ఎరుగని వ్యాఖ్యలు చేశాడు. వాళ్లిద్దరినే కాదు.. మదపుటేనుగులా ప్రవర్తిస్తున్న అంబటి రాంబాబునూ అలాగే చెయ్యాలంటూ మాట్లాడాడు వాసు. ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి మరీ ఈ లక్ష్యాన్ని చేరుకోవాలన్నట్లు మాట్లాడాడు. అందుకోసం అవసరమైతే 50లక్షలు ఆర్థికసాయం చేస్తానంటున్నాడు.. ఒకప్పుడు కమ్మవారికి ధైర్యంగా ఉన్న పరిటాల రవిని భౌతికంగా నిర్మూలించడం కోసం అప్పట్లో కొందరు ఆపరేషన్ నడిపించారు. అందుకు మొద్దు శీనును వాడుకున్నారు. పరిటాల బతికి ఉండి ఉంటే.. ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదంటున్నాడు వాసు. మొన్న జరిగిన సంఘటన మాముూలుది కాదు.. భవిష్యత్‌లో ఇంకా జరుగుతాయి. అలా జరగకుండా ఉండాలంటే ప్రతీకారం తీర్చుకోవాలంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసాడు.

టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల మధ్య చోటు చేసుకున్న ఇటీవలి వివాదంలో మల్లాది వాసు ‘కుల’ ప్రస్తావన చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇందులో భాగంగానే ఏపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల భౌతిక నిర్మూలనకు భారీ మొత్తాన్ని ‘ఆఫర్’గా ప్రకటించడం తీవ్ర వివాదంగా మారింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox