Road accident in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు . చంద్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాలీని బొగ్గులోడుతో వెళ్తున్న టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చండ్రుగొండ మండలంలోని సుజాతనగర్‌కు చెందిన పలువురు కూలీలు అన్నపరెడ్డిపల్లి మండలానికి వరినారు తీసేందుకు బొలెరో వాహనంలో బయలుదేరారు. తిప్పనపల్లి వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా బొగ్గు లోడుతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 10 మందిని 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు చనిపోయారు.
మృతులను కత్తి స్వాతి (27), సుజాత (40), లక్ష్మి(52), సాయమ్మ(42)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ట్రాలీ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా.. టిప్పర్ లారీ అదుపుతప్పి రోడ్డుపైనే బోల్తా పడింది.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి
మచిలీపట్నం జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టాలి.. అక్కినేని అభిమానుల డిమాండ్
హీరో విజయ్ రోల్స్ రాయిస్ కేసు: సింగిల్ జడ్జి బెంచ్ వ్యాఖ్యలను తొలగించిన మద్రాస్ హైకోర్టు

Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022