Breaking News

ఇవాంక ట్రంప్‌ని కూడా రమ్మంటారేమో? కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు

20 th Sep 2021, UTC

మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన  టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం గన్‌పార్క్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు పై ఐపీఎస్‌ అధికారి అకున్ సభర్వాల్ కమిటీ ఏమైంది? ఎక్సైజ్ శాఖ విచారణ నివేదికను ఎందుకు ఈడీకి ఇవ్వడం లేదు?  అంటూ ప్రశ్నించారు.అకున్ సబర్వాల్‌కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. డ్రగ్స్ కేసు విచారణలో ఉండగానే అకున్ సబర్వాల్‌ని తప్పించారు. బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ వరకూ పబ్బులు వ్యాప్తి చెందాయి. విదేశాల నుంచి వచ్చిన డ్రగ్స్, గంజాయి వాడకం ఎక్కువైంది. కేటీఆర్‌కి బాధ్యత లేదా? పిల్లలు డ్రగ్స్ మహమ్మారి బారిన పడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? కేటీఆర్ ఎదురు దాడి చేస్తున్నారు అని రేవంత్  రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ నువ్వు నా వెంట్రుకతో సమానం. డ్రగ్ టెస్టుకు రా అని నేను అడిగానా.. నువ్వు అడిగావా? నువ్వు విసిరిన సవాల్‌నే నేను స్వీకరించా. మరో ఇద్దరికి సవాల్ విసిరా. గన్ పార్క్‌కి అర గంట ముందే కేటీఆర్ వస్తారు అనుకున్నా. రాహుల్ గాంధీని రమ్మని చెప్పిన కేటీఆర్.ఇవాంక ట్రంప్‌ని కూడా రమ్మని అడుగుతారేమో. డ్రగ్స్‌తో నీకు సంబంధం ఉందని అన్నామా. నువ్వే డ్రగ్స్ టెస్టుకు సిద్ధమేనని సవాల్ చేశావు. 

కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ సవాల్ నేను స్వీకరించకపోతే... జనానికి అనుమానం వస్తుంది. ఆయన చెప్పిన మాటలకు నేను వైట్ ఛాలెంజ్ అని విసిరా. కేటీఆర్‌ని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తే. కేటీఆర్ స్లీపింగ్ ప్రెసిడెంట్‌గా మారిపోయాడు. నువ్వు ఎమ్మెల్యే కాకముందే నేను ఎమ్మెల్సీ అయ్యాను. నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే‌గా కేవలం 100 ఓట్లతోనే గెలిచావంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రానా, రకుల్ ప్రీత్ సింగ్‌ని ఈడీ పిలిచింది. వాళ్ళని నేను అంటుంటే కేటీఆర్ ఎందుకు ఉలిక్కి పడుతున్నాడని రేవంత్ ప్రశ్నించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox