Breaking News

వేణుగోపాలచారికి అసెంబ్లీ టిక్కెట్టు ఖాయమేనా?

25 th Jun 2022, UTC

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన. ప్ర‌భుత్వానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారిన వ్య‌వ‌హారం. ఏకంగా ముఖ్య‌మంత్రి వ‌స్తే త‌ప్ప తాము చ‌ర్చ‌ల‌కు రామ‌ని భీష్మించుకున్న విద్యార్థులు. రాష్ట్ర మంత్రి వెళ్లి హామీ ఇచ్చినా వీస‌మెత్తు విలువ ఇవ్వ‌ని విద్యార్థులు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్ర‌భుత్వం మాజీ కేంద్ర మంత్రి, ఢిల్లీలో తెలంగాణ వ్య‌వ‌హారాలు చ‌క్క‌దిద్దే కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల‌చారిని రంగంలోకి దింపింది. దీంతో ఆయ‌న త‌న వ్యూహాల‌ను అమ‌లు ప‌రిచారు. స‌మ‌స్య‌ను పూర్తి స్థాయిలో చ‌క్క‌దిద్ది ప్ర‌భుత్వానికి ఊర‌ట క‌లిగించారు. 

ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న త‌మ‌ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం  ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బాస‌ర ట్రిపుల్ ఐటీలో 8వేల మంది విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ నేప‌థ్యంలో క‌లెక్ట‌ర్‌, ఇత‌ర అధికారులు విద్యార్థుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. విద్యార్థులు ఎవ‌రూ కూడా విన‌లేదు. రెగ్యుల‌ర్ వీసీని నియ‌మించాల‌ని త‌దిత‌ర 12 డిమాండ్ల‌తో ఆందోళ‌న కొన‌సాగించారు. ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ వ‌చ్చే వ‌ర‌కు ఆందోళ‌న విర‌మించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు.మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు సైతం ఈ ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ప్రకటించడమే కాకుండా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ ముఖ్య నేత‌ల‌తో స‌హా చాలా మంది బాస‌ర‌కు చేరుకున్నారు. వారిని పోలీసులు అరెస్టు చేయ‌డం పెద్ద రచ్చకే దారితీసింది. ఆ క్రమంలో ఆందోళ‌న ఉధృతం అవ‌డంతో ప్ర‌భుత్వం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. పరిస్థితి చేయి దాటుతుండటంటలో ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఆయ‌న విద్యార్థుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే, విద్యార్థులు మంత్రి మాట‌లు ప‌ట్టించుకోలేదు మూడు, నాలుగు సార్లు హామీలు ఇచ్చార‌ని అవి అమ‌లు కాలేద‌ని ఇప్పుడు కూడా అమ‌లు కావ‌న్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  దాంతో నిస్సహాయ స్థితిలో ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది.అయితే ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చి విలేక‌రుల స‌మావేశంలో చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయ‌ని విద్యార్థులు త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌వుతార‌ని ప్ర‌క‌టించారు. అందుకు విరుద్ధంగా విద్యార్థులు చ‌ర్ఛ‌లు విఫ‌ల‌మ‌య్యాయ‌ని ఆందోళ‌న విర‌మించేది లేద‌ని తెగేసి చెప్పారు. వ‌ర్షం ప‌డుతున్నా లెక్కచేయకుండా విద్యార్థులు దీక్ష‌లు కొన‌సాగించారు. మ‌రోవైపు  విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విద్యార్థుల‌వి సిల్లీ డిమాండ్ల‌ని వ్యాఖ్యానించడంతో స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలం అయ్యింది. 

ఇక లాభం లేద‌ని భావించిన ప్ర‌భుత్వం వేణుగోపాలాచారిని రంగంలోకి దింపింది. ఆయ‌న అధికారులు, మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి త‌దిత‌రుల‌తో చ‌ర్చించారు. ఆ త‌ర్వాత నేరుగా బాస‌ర ట్రిపుల్ ఐటీకి మంత్రిని తీసుకువ‌చ్చి చ‌ర్చ‌లు స‌ఫ‌లం చేయ‌డంతో కీల‌క పాత్ర పోషించారు. అంత‌కు ముందు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ బాస‌ర‌కు వ‌చ్చి త‌మతో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని విద్యార్థులు డిమాండ్ చేశారు. లేక‌పోతే ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచి లిఖిత‌పూర్వక హామీ వ‌స్తే త‌ప్ప ఆందోళ‌న నుంచి వెన‌క్కి త‌గ్గ‌మ‌ని వెల్ల‌డించారు. కానీ వేణుగోపాలాచారి రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత ఇవేమీ లేకుండానే నిర‌స‌న విర‌మించారు. ఏదేమైనా ఐఐఐటీ విద్యార్థుల ఆందోళనను ముగించేలా ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన చారి తిరిగి పొలిటికల్ స్క్రీన్‌పై ఫోకస్ అవుతున్నారు. ఆయ‌న ముథోల్ కానీ, నిర్మ‌ల్‌లో కానీ టిక్కెట్ కోసం తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆయ‌నకు టిక్కెట్ రాని ప‌క్షంలో బీజేపీలో సైతం చేరుతార‌నే ఊహాగానాలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో చారి అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చారు. ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారిన అంశాన్ని చాలా చాక‌చ‌క్యంగా ప‌రిష్క‌రించిన వేణుగోపాల‌చారికి ఖ‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి వేణుగోపాలచారి అనుభవానికి గులాబీ పార్టీ ఏ మాత్రం ప్రాధాన్యత ఇస్తుందో చూడాలి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox