బియ్యం గింజపై బంగారు అక్షరాలు..!

9

ప్రధాని మోదీని ప్రశంసిస్తూ నిజామాబాద్‌ జిల్లా గుమ్మిర్యాలకు చెందిన స్వర్ణకారుడు, సూక్ష్మకళాకారుడు రామోజు మారుతి బియ్యపు గింజపై 78 స్వర్ణాక్షరాలను పొందుపరిచారు. ఈ గింజను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం రాజ్‌భవన్‌లో ఆవిష్కరించారు. 46 రోజులపాటు శ్రమించి బియ్యపు గింజపై 10 మిల్లీగ్రాముల బంగారంతో 2 మిల్లీమీటర్ల వెడల్పు, 8 మిల్లీమీటర్ల పొడవుతో అక్షరాలను అమర్చానని మారుతి తెలిపారు. ప్రధానిని కలిసి ఈ బియ్యపు గింజను అందజేయాలనే ఆకాంక్షను వెల్లడించారు. ఈ సందర్భంగా మారుతిని గవర్నర్‌ అభినందించారు.