హైదరాబాదు కు నిర్మల సీతారామన్..!

29

మోదీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020పై వివిధ వర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇందుకు గాను ఈ నెల 16,17 తేదీల్లో హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లో పర్యటించనన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసారు. ఈ సమావేశం లో ఆవిడ బడ్జెట్ తో ప్రభావితం కానున్న వారిని కలవనున్నారు. మొదటి సెషన్‌లో ఆమె వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు, రైతులతో మాట్లాడనున్నారు. అదే విధంగా రెండో సెషన్‌లో ఆర్థికవేత్తలు, ట్యాక్స్ ప్రాక్టీషనర్లు తదితరులతో భేటీ కానున్నారు. గతవారం ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో నిర్వహించిన ఇలాంటి ఇంటరాక్టివ్ సెషన్లలో కూడా మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.