తెలంగాణ లో జేసీ పోస్ట్ రద్దు..!

7

ఇకనుంచి తెలంగాణ లో జేసీ పోస్ట్ ఉండదని ప్రభుత్వం తెలిపింది. జాయింట్ కలెక్టరు పోస్ట్ ను రద్దు చేస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్థానం లో అదనపు కలెక్టర్లను నియమించనున్నారు. కలెక్టర్ల సదస్సుకు రెండు రోజుల ముందు.. జాయింట్‌ కలెక్టర్‌ పోస్టును రద్దు చేసి, ఆ స్థానంలో అదనపు కలెక్టర్‌ పోస్టును సృష్టించింది. ఐఏఎస్ అధికారులు లేదా ఇతర నాన్ కేడర్ అధికారులు ఈ పోస్టును భర్తీ చేయనున్నారు. స్థానిక సంస్థలకు మరియు రెవిన్యూ అధికారులకు వేరు వేరు గా కలెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కలెక్టర్ల సదస్సు జరగడానికి 2 రోజుల ముందుగా 49మంది అధికారులను బదిలీ చేసింది. ఇంకా జాయింట్‌ కలెక్టర్‌ పోస్టును రద్దుచేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదివరకే 21 జిల్లాలకు కలెక్టర్లను నియమించిన సంగతి తెలిసిందే.