రాష్ట్రంలో 500 కోట్ల పెట్టుబడులు

10

ముంబయికి చెందిన ప్రముఖ ఉత్పత్తి, ఆరోగ్య సంరక్షణ సంస్థ పిరమల్‌ తెలంగాణలో 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలం దిగ్వాల్‌ వద్ద గల తమ పరిశ్రమను విస్తరించనుంది. దీని ద్వారా దాదాపు రెండువేల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. సంస్థ ఛైర్మన్‌ అజయ్‌ పిరమల్‌ దావోస్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి తమ నిర్ణయాన్ని వెల్లడించారు.