శంషాబాద్ కు హై అలెర్ట్..!!

14

గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి హై అలెర్ట్ ప్రకటించారు. ఈ విషయం ఎయిర్పోర్ట్ నిర్వాహక సంస్థ జిఎంఆర్ తెలిపింది. కార్గో టెర్మినల్, పాసెంజర్ టెర్మినల్, పార్కింగ్ ఏరియాలు, బస్టాండ్, నోవాటెల్ హోటల్, రోటరీ చౌరస్తా, వంటి ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ లను ఉపయోగించి భద్రత ను పెంచారు. ఎయిర్పోర్ట్ కు వచ్చే వాహనాలు మరియు ఔటర్ రింగ్ రోడ్ లో తిరిగియే వాహనాలపై కూడా నిఘా పెంచారు. అంతేకాకుండా, విఐపి, వివిఐపి వంటి లగ్జరీ పాసులను రద్దు చేసింది.