ధోనీ అభిమానుల సందేహం..!

11

2019-2020 సంవత్సరానికి గానూ 27 మంది సభ్యులతో కూడిన కాంట్రాక్టు లిస్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో ధోనీ పేరు లేదు. దీంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటన త్వరలో వెలువడనుందన్న ప్రచారం జోరుగాజరుగుతోంది. గత ఏడాది వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఓడిపోయినప్పటి నుంచి.. ఆటకు ధోనీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచే క్రికెట్‌కు గుడ్ బై చెప్పేస్తాడన్న వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై ధోనీ ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ధోనీతో మాట్లాడిన తర్వాతే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని తెలుస్తోంది. రిటైర్ అవుతానని బీసీసీఐ పెద్దలకు ధోని చెప్పినట్లు సమాచారం. అందుకే బీసీసీఐ కాంట్రాక్టులో చోటు ఇవ్వలేదని చెబుతున్నారు.