మొదలు కాకుండానే ముగిసిన తొలి టీ-20 !

7

గుహావటి లో ఆదివారం భారత్ మరియు శ్రీలంక ల మధ్య జరగాల్సిన తొలి టీ-20 వర్షం కారణం గా రద్దయింది. సాధారణం గా వర్షం పడినపుడు కవర్లను అడ్డుపెట్టడం, తిరిగి మ్యాచ్ లను ప్రారంభించడం మామూలే. కానీ, కవర్ల నుంచి నీరు పిచ్ మీదకు చేరడం తో, పిచ్ అనువుగా లేనందున మ్యాచ్ ను నిలిపివేయాల్సి వచ్చింది. కాసేపట్లో మొదలుపెడతారు లే అనుకుంటూ అప్పటి దాకా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలపై నిర్వాహకులు నీళ్లు చల్లారు. నిజానికి సాధారణ వర్షాలు పడినపుడు ఒక గంట లేదా అరగంట గ్యాప్ తో మ్యాచ్ లను తిరిగి ప్రారంభిస్తారు. ఐతే, నిర్వాహకుల అశ్రద్ధ కారణంగానే మ్యాచ్ ని నిలిపివేయాల్సొచ్చిందని అభిమానులు మండిపడ్డారు.

Related image


భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ని ఎంచుకున్నారు. ఆటని ప్రారంభించేలోగా వర్షం మొదలై ఆట కి అంతరాయం కలిగించింది. వర్షం గంట లోనే ఆగిపోయినా, నిర్వాహకులు మైదానాన్ని సిద్ధం చేయలేకపోయారు. కవర్లనుంచి పిచ్ మీదకి నీరు చేరడం తో అక్కడక్కడా పచ్చి గా తయారైంది. ఇందువల్ల అంపైర్ల కు మ్యాచ్ ని రద్దు చేయడం తప్ప మరో దారి కనిపించలేదు. ఈ టీ-20 మ్యాచ్ తో పాత గాయాలనుంచి కోలుకున్న బుమ్రా తిరిగి తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించారు. ఇతనితో పాటు గా, పేసర్లు నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్ కూడా రంగప్రవేశం చేసారు. శ్రీలంక జట్టులో కూడా ఒక స్పిన్నర్ మరియు ఏంజెలో మాధ్యుస్ ఈ మ్యాచ్ ద్వారా తమ ప్రతిభను చాటుకోనున్నారు. కాగా, మ్యాచ్ రద్దు కావడం తో వీరందరికి నిరాశే మిగిలింది.
ఈ సంఘటన గురించి ఏసీఏ కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ, పిచ్ మీదకి నీళ్లు రావడం గురించి తనకి తెలీదు అని అన్నారు। భారీ వర్షం కారణం గానే మ్యాచ్ రద్దు చేశామని, తక్కువ సమయమే ఉండటం తో సిబ్బంది మైదానాన్ని రెడీ చేయలేకపోయారని చెప్పారు। ఇంకా మాట్లాడుతూ, తానింకా గ్రౌండ్ మెన్స్ తో మాట్లాడలేదని, ఏమైనా తప్పు జరిగిందేమో వాళ్ళని అడిగి తెలుసుకుంటానని చెప్పారు।