ఆటోగ్రాఫ్ అడిగిన అభిమానికి ధోని సర్‌ప్రైజ్..!

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్ లు, కార్లంటే ఎంతో మోజు. ఇటీవల ధోనీ నిస్సాన్ జోంగా కారు కొన్నాడు. మరోవైపు ధోనీ వద్ద దాదాపు 74 బైకులున్నాయి. ఇటీవల బైక్ లపై తనకున్న ఇష్టాన్నిధోనీ వ్యక్త పరుస్తూ.. ఒక అభిమాని ఆటో గ్రాఫ్ అడిగితే సదరు అభిమాని వాహనం బుల్లెట్ ఎన్ ఫీల్డ్ పై సంతకం చేశాడు. దీంతో సదరు అభిమాని ఉబ్బి తబ్బిబైపోయాడు.  ఈ బైక్ ను జీవితాంతం కాపాడుకుంటానని అన్నాడు. ధోనీ ప్రస్తుతం క్రికెట్ దూరంగా ఉంటూ కుటుంబంతో గడుపుతున్న విషయం తెలిసిందే.