మ్యాచ్‌ మధ్యలో అంపైర్‌కి గుండెపోటు..!

34

పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో విషాదం నెలకొంది. నసీమ్ షేక్ అనే అంపైర్ మ్యాచ్ లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు వదిలాడు. కరాచీలో ఓ క్లబ్ స్థాయి మ్యాచ్ కు నసీమ్ అంపైరింగ్ చేస్తున్నాడు. స్థానిక టీఎంసీ మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా నసీమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మార్గమధ్యంలోనే ఆ అంపైర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఓ చిరువ్యాపారిగా ఉన్న నసీమ్ క్రికెట్ పై ఆపేక్షతో అంపైర్ గా ఎదిగాడు. కరాచీ క్రికెట్ వర్గాల్లో మంచి అంపైర్ గా గుర్తింపు తెచ్చుకున్నా, 56 ఏళ్ల వయసుకే తనువు చాలించాడు. నసీమ్ కు గతంలో ఏంజియోగ్రాఫీ నిర్వహించినట్టు తెలుస్తోంది.